YS Bhaskar Reddy Latest News: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఈ కేసులో భాగంగా అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకు ఒక్కసారిగా రక్తపోటు పెరగడంతో వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. చికిత్స తర్వాత మళ్లీ చంచల్ గూడకు తీసుకెళ్లగా... అవసరమైతే మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.
మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ రెడ్డి తల్లిని శుక్రవారం డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈ నెల 19 నుంచి కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలక్ష్మీ ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలుస్తోంది.
2023-05-26T11:24:18Z dg43tfdfdgfd