LIFT FELL DOWN: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం, తెగిపడిన లిఫ్ట్.. ముగ్గురు దుర్మరణం!

Lift Fell Down at NTTPS at Vijayawada: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం వీటీపీఎస్ లోని లిఫ్ట్ తెగిపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎనిమిది మందితో పైకి వెళ్తున్న లిఫ్ట్ తీగ ఒక్కసారిగా తెగిపోవ‌డంతో అత్యంత వేగంగా కింద‌కు జారిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో స్పాట్ లో ఒక‌రు చ‌నిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు సమాచారం. మరికొందరికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొండ‌ప‌ల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

2023-03-18T05:52:59Z dg43tfdfdgfd